హైద‌రాబాద్‌లో 7.7 కోట్ల న‌గ‌దు ప‌ట్టివేత‌-నాలుగురు వ్యక్తుల ఆరెస్ట్‌

0
151

అమ‌రావ‌తిః ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి హైద‌రాబాద్‌కు భారీగా నగదును తీసుకొస్తున్నఇద్ద‌రు వ్య‌క్తుల‌ను సైఫాబాద్ వ‌ద్ద‌ పోలీసులు అరెస్ట్ చేసి,వారి నుండి రూ.7,7 కోట్ల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు.బుధ‌వారం ఉదయం ప‌బ్లిక్‌గార్డ్‌న్స్ వ‌ద్ద కారులో త‌ర‌లిస్తున్నన‌గదును స్వాధీనం చేసుకుని,భూప‌తిసింగ్‌,రాజ్‌పురోహిత్‌,సునీల్‌కుమార్‌ఆహుజా,ఆశిష్‌కుమార్ ఆహుజ‌,మ‌హ్మ‌ద్అజాంను ఆదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.త్వరలోనే వీరిని కోర్టులో హాజరు పరుస్తామని,ఈ నగదును ఎవరికోసం తీసుకొచ్చారు? ఎవరు పంపారు? అసలు ఈ నగదు బట్వాడా వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నామని సీటి పోలీసు అధికారి పేర్కొన్నారు.వీరిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరుతామని తెలిపారు.ఓ రాజకీయ నేత ఇంటి సమీపంలోనే ఈ మొత్తం నగదు దొరకడంతో ఆ కోణంలోనూ దర్యాప్తును కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

LEAVE A REPLY