జ‌న‌సేన పార్టీకి 4 ల‌క్ష‌ల విరాళం ఇచ్చిన ప‌వ‌న్ త‌ల్లి

0
99

అమ‌రావ‌తిః జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తల్లి కొణెదల అంజనాదేవి ఆ పార్టీకి నాలుగు లక్షల రూపాయల విరాళం అందజేశారు. మంగ‌ళ‌వారం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి పవన్ కల్యాణ్‌కు చెక్కును ఆమె అందజేశారు.ఈ సందర్భంగా తనను కలిసిన జనసేన పార్టీ ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం ఎంతో శ్రమ,బాధ్యతతో కూడుకున్నదని అంటువంటివారి కుటుంబాలకు అండగా నిలవాలని కుమారుడు పవన్ కళ్యాణ్ ను అడిగినట్లు చెప్పారు.ఎందుకంటే,పోలీస్ ఉద్యోగం గురించి తనకు బాగా తెలుసని,తన తాత గారు బ్రిటిష్ హయాంలో పోలీస్ కానిస్టేబుల్ గా పని చేశారని,తన తండ్రి ఎక్సయిజ్ శాఖలో సర్కిల్ ఇన్స్ పెక్టర్ గా పశ్చిమగోదావరి జిల్లాలో పని చేసేవారిని గుర్తుచేసుకున్నారు.ఎక్సయిజ్ శాఖలోనే కానిస్టేబుల్ గా పని చేసిన కొణెదల వెంకట్రావుతో తనకు వివాహమైందని, ఆ శాఖలో అనేక పదోన్నతలు పొంది అసిస్టెంట్ సూపరింటెండెంట్ స్థాయిలో రిటైర్ అయిన విషయాన్ని ప్రస్తావించారు.తన భర్త వెంకట్రావు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినందువల్లే ఇప్పటికి తనకు పెన్షన్ వస్తోందని, ఆ పెన్షన్ డబ్బుతోనే ఇప్పుడు జనసేన పార్టీ కి నాలుగు లక్షల రూపాయల విరాళాన్ని అందచేశానంటూ ఆనందం వ్యక్తం చేశారు.పార్టీ కార్యాలయానికి తొలిసారిగా వచ్చిన తన మాతృమూర్తికి పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించిన పవన్ కల్యాణ్,ఆమె పాదాలకు నమస్కరించారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ‘ప్రభుత్వోద్యోగి కొడుకుగా నాకు పెన్షన్ విలువ తెలుసు. అందుకే ప్రభుత్వోద్యోగులు సి.పి.ఎస్. విధానం రద్దు కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నాను. వారికి న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తాను’ అని అన్నారు.

LEAVE A REPLY