అమరావతిః శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో తుఫాన్ నష్టం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ బయట ప్రపంచానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వెల్లడించలేదన్నఆవేదన అక్కడి ప్రజల్లో ఉందని, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోని రాజ్ భవన్లో మంగళవారం సాయంత్రం నరసింహన్ను కలిసి తిత్లీ తుపాను నష్టంపై తమ పార్టీ రూపొందించిన నివేదికను అందజేశారు.అనంతరం, అయన మీడియాతో మాట్లాడుతూ. ప్రజల్లో ఉన్నస్పందననే గవర్నర్కు నివేదిక రూపంలో అందజేశామని చెప్పారు.తుఫాన్ బాధిత గ్రామాల్లో గతంలో ఉన్న పరిస్థితి రావాలంటే కనీసం పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పడుతుందని అన్నారు.ఈ సందర్భంగా ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పవన్ స్పందిస్తూ,చాలా సంతోషంగా ఉన్నామని,కోర్టు ఆదేశాలను గౌరవించి ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరారు.స్దానిక సంస్దల నిర్వర్యం చేసే దిశగా ప్రభుత్వం ప్రత్యేక పాలనధికారులను నియమించడంపై తామ పార్టీ మొదటి నుండి అభ్యతరం వ్యక్తం చేస్తున్న విషయంను గుర్తు చేశారు.