ఆంధ్ర‌ప్ర‌దేశ్‌,తెలంగాణ రాష్ట్రల్లో బార్‌కౌన్సిల్‌ ఎన్నిక‌ల‌కు నోటీఫికేష‌న్‌

0
86

అమ‌రావ‌తిః ఆంధ్ర‌ప్ర‌దేశ్‌,తెలంగాణ రాష్ట్రాల్లో బార్ కౌన్సిళ్ల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 17 నుంచి 26 వరకు నామినేషన్ల స్వీకరణ, జూన్ 29న ఎన్నిక జరగనున్న‌ది.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 52 వేల మంది న్యాయవాదులకు ఓటు హక్కు ఉండగా,అందులో ఏపీ నుంచి 29 వేల మంది,తెలంగాణలో 23 వేల మంది ఉన్నారు.ఒక్కో రాష్ట్రానికి బార్ కౌన్సిల్ కు 25 మంది చొప్పున ఎన్నిక కానున్నారు.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా బార్ కౌన్సిళ్లు ఏర్పాటు చేయాలని గత మార్చిలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

LEAVE A REPLY