నాగార్జున న‌టించిన ఆఫీస‌ర్ చిత్రం వాయిదా

0
89

వ‌ర్మ‌ తీరు ప‌ట్ల కోర్టు ఆగ్ర‌హం.
అమ‌రావ‌తిః సినిమా ప‌రిశ్ర‌మ‌లో వివాదాస్పద దర్శకుడి పేరుప‌డిన‌ రాంగోపాల్ వర్మ మళ్లీ ఇబ్బందుల్లో పడ్డారు. ప్రస్తుతం అక్కినేని నాగార్జునతో రూపొందించిన చిత్రం ఆఫీసర్‌ మే 25వ తేదీన విడుదల కావాల్సి ఉంది.అయితే కొన్ని సాంకేతిక కారణాల వ‌ల్ల విడుదల వాయిదా పడిన‌ట్లు రాంగోపాల్ వ‌ర్మ ట్వీట‌ర్లో తెలిపారు.బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ఆఫీసర్‌ విడుదలలో జాప్యం ఏర్పడినట్టు సమాచారం.సినిమా రిలీజ్ వాయిదా వివాదం అక్కినేని నాగార్జునకు ఇబ్బందిగా మారే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం.తమ సంస్ద‌కు వర్మ రూ.1.06 కోట్లు చెల్లించాలని వైటీ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ తరుఫున బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది.చిత్ర హక్కులను,డిజిట్ రైట్స్,తదితర విషయాల్లో వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఐటీ ఎంటర్‌టైన్‌మెంట్ దాఖలు చేసిన పిటిషన్‌పై మే 4న కోర్టు విచారణ జరిపింది. ఆ సందర్భంగా వర్మ తరుఫు న్యాయవాది విచారణకు హాజరయ్యి, తన క్లయింట్ వర్మ మే 7న జరిగే విచారణకు హాజరవుతారని వెల్లడించారు.
మే 7న జరిగిన విచారణకు వర్మ బదులుగా సహ నిర్మాత సుధీర్ చంద్ర పదిరి హాజరుకావడంపై కోర్టు సీరియస్ అయింది.ఈ విచారణకు హాజరుకావాల్సిందేనని కోర్టు అదే రోజు 5 గంటలకు విచారణను వాయిదా వేసింది.అలాగే ఒప్పంద పత్రంపై సంతకం చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వర్మ హాజరుకాలేదు.ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ రూపొందించే చిత్ర విడుదల స్టే విధించింది.టెక్నికల్ సమస్యల వల్ల ఆఫీసర్ చిత్ర రిలీజ్‌ను జూన్ 1 తేదీకి వాయిదా వేశానని వర్మ తెలిపారు.

LEAVE A REPLY