భరత్ అనే నేను ప్రమాణ స్వీకారంతో ప్రారంభం-ప్రిన్స్‌

0
118

అమ‌రావ‌తిః భరత్ అనే నేను చిత్రం విన్నూత్నంగా ప్రమాణ స్వీకారంతో ప్రారంభం అయిందని మహేష్ బాబు అన్నారు.శనివారం భరత్ బహిరంగ సభ ఎల్బీ స్టేడియంలో భారీ జ‌రిగింది.హిరో మ‌హేష్‌బాబు మాట్లాడుతూ ప్ర‌స్తుతం బాహిరంగ సభ జరుపుకుంటునమ‌ని, ఏప్రిల్ 20 తరువాత విజయోత్సవ ఊరేగింపు జరుగుతుందని అభిమానులని ఉత్సాహపరిచేలా అన్నారు. భరత్ అనే నేను చిత్రం తరువాత బాక్స్ ఆఫీస్ బద్దలైపోవడం ఖాయం అని అన్నారు. ప్రిన్స్ మహేష్ తన సినిమాలో ఒక హీరోయిన్‌కు ఒకేసారి అవకాశం ఇస్తారని,మళ్లీ మహేష్ సరసన నటించే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను అని కైరా అద్వానీ అన్నారు.మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ అని, మీ అందర్ని చూస్తే గొప్ప సినిమాలో పనిచేసినందుకు గర్వంగా ఉందని ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ అన్నారు. కొరటాల శివ గురించి చెబితే సమాజం పట్ల ప్రేమ ఉండాలని తొలి సినిమా మిర్చి తీశాడని, సొంత గ్రామాన్ని బాగు చేసుకోవాలి.. ఊరికి ఏదైనా చేయాలి అనే పాయింట్‌తో శ్రీమంతుడు,మనుషుల కంటే ప్రకృతి గొప్పది అనే పాయింట్ జనతా గ్యారేజ్ తీశాడన్నారు.సమాజం పట్ల బాధ్యత ఉండాలనే పాయింట్‌తో నాలుగో సినిమా భరత్ అనే నేను తీశాడ చెప్పారు.కొరటాల శివ,మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు చిత్రాన్నిఈ సందర్భంగా సూప‌ర్‌స్టార్‌ కృష్ణ గుర్తు చేసుకున్నారు. శ్రీమంతుడు చిత్రం టాలీవుడ్‌లో రికార్డులు తిరగరాసిందన్నారు. భరత్ అనే నేను చిత్రం అంతకంటే పెద్ద విజయం సాధించి మహేష్ కెరీర్ లో నెం 1 చిత్రం గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. మహేష్ కోసం వేలాదిగా తరలి వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసారు.

LEAVE A REPLY