బాబాయ్ ఏమ‌డిగితే అది చేసేందుకు సిద్దం-రామ్‌చ‌ర‌ణ్‌

0
142

అమ‌రావ‌తిః బాబాయ్ ఏమ‌డిగితే అది చేసేందుకు సిద్దంగా వున్నాని,జనసేన పార్టీ తరపున ప్రచారం చేసేందుకు తాను సిద్ధమని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటున్నాడు. గురువారం బ్యాంకాక్ నుండి తిరిగొచ్చిన రామ్ చరణ్‌ను హైదరాబాద్‌లో మీడియా పలకరించింది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.ఈ పర్యటనలో పవన్ కల్యాణ్ బాబాయ్‌ కష్టపడుతుండటం చూస్తుంటే బాధగానే ఉంది కానీ, ప్రజల కోసం పర్యటిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. అయ‌న‌ మీడియా అడిగిప ప్ర‌శ్న‌ల‌కు బ‌దులు ఇచ్చారు.
ప్ర‌శ్నః- శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న మీ బాబాయ్.. ఎండల్లో తిరుగుతూ బాగా కష్టపడుతుంటే మీకు ఎలా అనిపిస్తోంది?’
రామ్ చరణ్: ప్రజలు ఎంతగా బాధపడుతున్నారనే విషయాన్ని ఆయన గుర్తించారు. ప్రజల బాగు కోసం ఆయన వెళుతున్నారు కనుక మనం ప్రోత్సహించాలే తప్ప బాధపడకూడదు.
ప్ర‌శ్నః- ఒకవేళ ప్రచారానికి రమ్మనమని పవన్ కల్యాణ్ చెబితే మీరు వెళ్తారా?–రామ్ చరణ్ : ఆయన ఏమడిగితే అది చేస్తాను
ప్ర‌శ్నః-ప్రచారం చేస్తానని మీరేమైనా అడిగారా?– రామ్ చరణ్ : అలాంటి ప్ర‌స్తానం మా మ‌ధ్య ఇంత వ‌ర‌కు రాలేదు.

LEAVE A REPLY