సైరా ఫ్రీ రిలీజ్ వేడుకలు కర్నూలులో!

అమరావతి: చారిత్రత్మక కథతో  అక్టోబర్ 2 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్న సైరా చిత్రంకు ఈ నెల 15వ తేదీ నుండి సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టేందుకు చిత్రంయూనిట్ సిద్దంమౌవుతుంది. సెప్టెంబర్ 15 వ తేదీన కర్నూలు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారని సమాచారం. సైరా నారసింహారెడ్డి పుట్టింది కర్నూలు జిల్లా కావడంతో,,ఇక్కడ ఆ వేడుకను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుది.ఈ మెగా ఈవెంట్  కు మెగా హీరోలతో పాటు స్పెషల్ గెస్ట్స్ లుగా అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ కూడా ఉన్నారని తెలుస్తోంది. అమితాబ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.మెగాస్టార్ కు రజినీకాంత్ మంచి స్నేహితుడు.   ఇద్దరు కలిసి గతంలో అనేక సినిమాలు చేశారు.ఈ వేదిక నుండి ఆడియో, ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తారని ఫిల్మ్ నగర్ వర్గాలు అనుకుంటున్నారు.!