ట‌పాసుల గోడౌన్‌లో ఘోర ఆగ్నిప్ర‌మాదం 10 మంది మృతి

0
65

అమ‌రావ‌తిః వ‌రంగ‌ల్‌ నగర శివారులోని కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్ వర్క్స్‌లో బుధవారం ఉదయం 10 గంట‌ల స‌మ‌యంలోభారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జ‌రిగిన స‌మ‌యంలో 10 మంది కార్మికులు సజీవదహనం అయ్యివుంటార‌ని, ప్రమాదవశాత్తు టపాసులు పేలడంతో దాదాపు 2 కిలోమీట‌ర్ల వ‌ర‌కు శ‌బ్దం విన్పించిన‌ట్లు స్దానికులు తెలిపారు.టపాసుల పేలుళ్ల ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి,గుర్తు పట్టలేని స్థితిలోమృతదేహాలు కాలిపోయాయి.మృతుల్లో మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.మరో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడగా,వీరిపరిస్థితి విషమంగా ఉండ‌డంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.ఘటనాస్థలికి చేరుకున్న4గు ఫైరింజ‌న్ స‌హ‌యంతో మంటలను అదుపుచేశారు.ఆస్తి నష్టం భారీగా వున్న‌ట్లు తెలుస్తుంది.ఘటనాస్థలికి చేరుకున్నరెవెన్యూ అధికారులు,పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.ఘటనాస్థలిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,కలెక్టర్ హరిత,సీపీ రవీందర్ తో పాటు పలువురు పరిశీలించారు.భద్రకాళి ఫైర్ వర్క్స్ అగ్నిప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన‌ కుటంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

LEAVE A REPLY