ఓటుకు నోటు కేసు పురోగ‌తిపై స‌మీక్ష నిర్వ‌హించిన‌ కేసీఆర్

0
93

అమ‌రావ‌తిః చంద్ర‌బాబు చుట్టు రాజ‌కీయ ప‌ర‌మైన ఉచ్చు బిగుసుకుంటున్న‌ట్లు క‌న్పిపిస్తుంది.తెలంగాణ ఎమ్మేల్సీ ఎన్నిక సంద‌ర్బంలో సంచలనం రేకెత్తించిన ఓటుకు నోటు కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సమీక్ష నిర్వహించారు.కేసు పురోగతి వివరాలను తెలుసుకున్నారు. ఈ సమీక్ష సమావేశానికి పోలీసు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించి లభించిన ఆధారాలు,వాయిస్ రికార్డ్,ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ నివేదికపై కేసీఆర్ ఆరా తీశారు.ఈ సమావేశానికి డీజీపీ,ఏసీబీ డీజీ, న్యాయశాఖ కార్యదర్శి,న్యాయనిపుణులు హాజరయ్యారు.2 గంటలకు పైగా ఈ సమీక్ష కొనసాగింది.గత కొంత కాలంగా ఓటుకు నోటు కేసు మరుగున పడినట్టే కనిపించింది.అయితే,ఈరోజు దీనిపై కేసీఆర్ సమీక్ష నిర్వహించడంతో రాజకీయంగా మళ్లీ చర్చనీయాంశం అయింది.

LEAVE A REPLY