జ‌న‌సేనానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన శ్రీకాకుళంవాసులు

0
61

అమ‌రావ‌తిః 2019 ఎన్నికల్లో ప్రజలు మార్పుకోరుకుంటున్నారన్న విష‌యం స్ప‌ష్టంగా కనిపిస్తుందని,తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కి శ్రీకాకుళం ప్రజలు బ్రహ్మరథం పట్టి ఆ మార్పునకు శ్రీకారం చుట్టారని జనసేన పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం అన్నారు. బుధ‌వారం ఆయన హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ సత్తా తెలుసు కాబట్టే గత ఎన్నికల్లో టీడీపీ ఆయన మద్దతు తీసుకుందన్నారు.వచ్చే ఎన్నికల్లో జనసేన సత్తా చాటడం ఖాయమని, ప్రజలు పవన్‌పై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు శ్రీకాకుళంలో ప్రజలతో మాట్లాడి వారి సమస్యల మూలాలు, పాలకుల నిర్లక్ష్య ధోరణిని ఎండ‌క‌ట్టేర‌ని,ఉత్త‌రాంధ్ర‌ప్రాంతం నేటికి ఎందుకు వెనుక‌ప‌డిందంటు ప్ర‌జ‌వేదిక‌ల‌పై నుండి నాయ‌కులను నిల‌దీశార‌న్నారు. స‌మ‌స్య‌ల‌పై ఆవ‌గాహ‌న పెంచుకుని,వాటి ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని అయ‌న తెలిపార‌న్నారు.రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు క‌న్పిస్తున్న‌ర‌ని తెలిపారు.

LEAVE A REPLY