జాతీయ జెండాను చూసినప్పుడల్లా-జ‌న‌సేనాని

0
114

అమ‌రావ‌తిః జాతీయ జెండాను చూసినప్పుడల్లా ఉవ్వెత్తున ఎగిసిపడే గుండె ధైర్యం,దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే ఆత్మస్థైర్యం రెపరెపలాడుతోందని, ప్రపంచ అతిపెద్ద భార‌తదేశం జాతీయ జెండా (22,326 స్క్వేర్ అడుగులు)ను ఎన్టీఆర్ స్టేడియంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ఆవిష్కరించారు.వెబ్రంట్ ఆర్గ‌నైజేష‌న్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొని జెండాను అవిష్కరించిన సందర్భంగా సదరు సంస్థకు పవన్ ధన్యవాదాలు తెలుపుతూ జులై 22, 1947లో మన జాతీయ జెండాకు జవహర్ లాల్ నెహ్రూ ఆధ్వర్యంలోని సభ్యులు ఆమోదం తెలిపారని చెప్పారు. జెండాలోని రంగులు 3 రంగులు,ధర్మ చక్రం జాతీయ సమైక్యతకు నిదర్శనమని అన్నారు.జాతీయ జెండా అంటే అది ఏదో ఒక పార్టీదో,మతానిదో, ప్రాంతానిది కాదని,,ప్రతీ ఒక్కరిదని సర్వేపల్లి రాధాకృష్ణ అన్న విష‌యం అయ‌న గుర్తు చేశారు.జాతీయ జెండాలోని కాషాయం రంగు అంటే హిందువులది కాదన్న ప్ర‌తి ఒక్క‌రు గుర్తుంచుకోవాల‌న్నారు.రాజకీయ నాయకులు స్వలాభం కోసం కాకుండా ప్రజలకు నిస్వార్థ సేవ అందించాలనే విషయాన్ని తెలుపుతుందని అన్నారు.యువత రాజకీయాల్లోకి రావాలని అకాంక్షించారు.దేశ భక్తి రాజకీయ నాయకులు మర్చిపోయారు కానీ,,, విద్యార్థులు,యువత మ‌ర్చిపోలేద‌న్నారు.ఈ సందర్భంగా ఆయన అక్కడున్నయువ‌త‌తో ప్రతిజ్ఞ చేయించారు.భారత్ మాతాకీ జై, జైహింద్ అంటూ పవన్ తన ప్రసంగాన్ని ముగించారు.

LEAVE A REPLY