ఈనెల 26 నుండి జ‌న‌సేనాని పోరాట యాత్ర ప్రారంభం

0
32

అమ‌రావ‌తిః జనసేన పోరాట యాత్రను ఈ నెల 26 నుంచి తిరిగి జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నార జ‌న‌సే ఉపాధ్య‌క్ష‌డు బి.మ‌హేంద్ర‌రెడ్డి తెలిపారు.తన వెంట వుండే సిబ్బందిలోని ముస్లిం సోదరుల కోసం రంజాన్ పండుగ సందర్భంగా విశాఖ జిల్లా యాత్రకు విరామం ఇచ్చిన సంగతి విదితమే.తనను మూడు నెలలుగా బాధిస్తున్న కంటి సమస్యకు ఈ విరామ కాలంలో చిన్నపాటి శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం తిరిగి యాత్రను ప్రారంభిద్దామనుకున్నారని,ఈ నెల 24 న శస్త్ర చికిత్స చేయాలని ప్రసాద్ కంటి ఆసుపత్రి డాక్టర్లు నిర్ణయించారన్నారు. అయితే, తాజాగా జరిగిన వైద్య పరీక్షలను పరిశీలించిన డాక్టర్లు శస్త్ర చికిత్సకు ఇంకొంత కాలం ఆగాలని సూచించడంతో పోరాట యాత్రను తిరిగి ప్రారంభించాలని త‌మ అధ్య‌క్ష‌డు నిర్ణయించారన్నారు.ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే ఈ మలివిడత యాత్ర విశాఖ జిల్లాలో మూడు నుంచి నాలుగు రోజులపాటు కొనసాగుతుందని, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో పర్యటించడంతో పాటు ఉత్తరాంధ్ర మేధావులతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యే అవకాశం వుండ‌వ‌చ్చ‌న్నారు. విశాఖ జిల్లా అనంతరం పోరాట యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభం అవుతుందని, తూర్పు గోదావరి జిల్లాలో పోరాట యాత్ర సన్నాహాలలో ఆ జిల్లా జనసేన నేతలు నిమగ్నమై వున్నారని తెలియ‌చేశారు.

LEAVE A REPLY