మే 15 నుండి రాష్ట్రంలో జ‌న‌సేనాని బ‌స్సు యాత్ర‌..?

0
93

అమరావతిః జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ నెల 15వ తేదిన అనంత‌పురం నుండి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. బస్సుయాత్రను పురస్కరించుకొని పార్టీ యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేసింది.అనంతపురం జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు దాదాపు 4 నెల‌ల పాటు ఈ యాత్ర కొనసాగనున్న‌ట్లు స‌మాచారం.తొలి విడత ఎన్నికల ప్రచారంగా బస్సు యాత్రను పార్టీ నేతలు భావిస్తున్నారు.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జ‌న‌సేన పోటీ చేయాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.తొలివిడత ప్రచారంలోనే ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు తమ పార్టీ విధానాలను ప్రచారం చేయాలని జ‌న‌సేనాని భావిస్తున్నారు.అదే స‌మ‌యంలో ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సన్నద్దం చేసేందుకు ప్లాన్ చేయనున్నారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాల ఏర్పాటుతో పాటు క్యాడర్‌తో సమావేశాలను ఏర్పాటు చేయనున్నారు.నాలుగు నెల‌ల పాటు పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను బేరీజు వేయనున్నారు.బస్సు యాత్రలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను కూడ పవన్ కళ్యాణ్ ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. ప్రతి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాలను సిద్దం చేయాలని పార్టీ యంత్రాంగాన్ని పవన్ కళ్యాణ్ కోరిన‌ట్లు తెలుస్తుంది. బస్సు యాత్ర సందర్భంగా ఆ జాబితాను వపన్ కళ్యాణ్ ఫైనల్ చేసే అవకాశం లేకపోలేదు.ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు ఏమిటీ, ఏ పార్టీ బలమెంత,ఏ అభ్యర్ధిని బరిలోకి దింపితే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందనే విషయాలపై పవన్ బస్సుయాత్ర సందర్భంగా పార్టీ నేతలతో చర్చించే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY