నాపై ఆస‌త్య ప్ర‌చారం TDP IT విభాగం ప‌నే-కృష్ణారావు

0
100

అమరావతిః తిరుమ‌ల‌తిరుప‌తి దేవస్దానాన్ని కేంద్రం స్వాధీనం చేసుకోబోతోందని, దీనివెనుక నా హస్తం ఉందంటూ జరిగిన ప్రచారం వెనుక TDP IT విభాగం వుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆరోపించారు.మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పనిచేసేTDP IT  విభాగం వారే ఇలా ప్రత్యేకంగా కొన్ని వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఐవైఆర్ సంచలన ఆరోపణలు చేశారు.తిరుమ‌ల‌తిరుప‌తి దేవస్దానం వివాదంతో తనకు ముడి పెట్టడాన్ని తప్పుపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు.సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తు,తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాయని సిఎం చంద్రబాబుకు రాసిన తన బహిరంగ లేఖలో కృష్ణారావు మండిపడ్డారు.టిడిపి ఈ విధంగా చేయడం తప్పని,ఇలాంటి అసత్యాలను ప్రచారం చేయడం సరికాదని ఆయన చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.టిడిపి ఇటువంటి వాటికి కేంద్ర బిందువు కాకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు.1958 నాటి పురాతన కట్టడాల చట్టం ప్రకారం ఏదైనా కట్టడాన్ని పరిరక్షిత కట్టడంగా లేదా జాతీయ ప్రాధాన్యం ఉన్న కట్టడంగా నిర్ణయిస్తే ఆ కట్టడం పురావస్తు శాఖ పరిధిలోకి వెళ్లాల్సి ఉంటుందన్నారు.అదే జరిగితే ఆ కట్టడం జీవకళ తప్పిపోయే ప్రమాదం ఉందన్నారు.ఈ చట్టంలో సవరణలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐవైఆర్ సూచించారు.కట్టడాల్లో శాశ్వత మార్పులూ చేర్పులూ చేయాలనుకుంటే పురావస్తు శాఖ అనుమతి తప్పనిసరి చేస్తూ చట్టాన్ని సవరించడమే ఈ సమస్యకు పరిష్కారంగా ఐవైఆర్ పేర్కొన్నారు.

LEAVE A REPLY