విద్యాశాఖ మంత్రి సంతకం ఫోర్జరీ చేసిన హెడ్ మాస్టర్ మంగళ

అమరావతి: విద్యావ్యవస్థకే మచ్చతెచ్చిన మంగళపై చర్యలు తీసుకోవాలంటు ఉపాధ్యాయ సంఘలు డిమాండ్ చేస్తున్నాయి. మానవత్ మంగళ ఓ ప్రభుత్వ స్కూల్‌కు హెడ్‌ మాస్టర్ గా పనిచేస్తున్నారు.ఇదే సమయంలో జిల్లా ఓపెన్ స్కూల్స్ ఇన్ ఛార్జ్ కోఆర్డినేటర్‌ గానూ విధులు నిర్వర్తిస్తున్నారు.ఇటీవల ఆమెను కోఆర్డినేటర్ పోస్టు నుంచి తప్పించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.కోఆర్డినేటర్‌గా వేరే వ్యక్తిని నియమించేందుకు కసరత్తు పూర్తి అయిందన్న సమాచారంతో సదరు హెడ్ మాస్టర్ మంగళ చక్రం తిప్పింది. మంత్రి కేటీఆర్ లెటర్ హెడ్‌తో ఉన్న రికమండేషన్ లెటర్ తీసుకొచ్చి జిల్లావిద్యాశాఖ అధికారికి అందించారు.ఓపెన్ స్కూల్స్ కోఆర్డినేటర్‌గా ఆమెనే కొనసాగించాలని సిఫారసుల్లో ఉండటంతో తిరిగి ఆమెనే కొనసాగిస్తున్నారు.మంగళ విషయంపై జిల్లా అధికారులకు సమాచారం అందడంతో,విషయంపై లోతుకు వెళ్లడంతో తేలిందేంటంటే,, నిజానికి కేటీఆర్ ఆమెకు ఎలాంటి రికమండేషన్ ఇవ్వలేదని, కేటీఆర్ పేరిట స్వయంగా ఆమె ఓ రికమండేషన్ లెటర్ సృష్టించుకుని, దానిపై ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. ఆమె వ్యవహారం గురించి జిల్లా అధికారులు విషయాన్ని రాష్ట్ర ఓపెన్స్‌ స్కూల్స్‌ సొసైటీ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. జిల్లా పాలనా వ్యవహారాల్లో స్థానిక మంత్రికి తెలియకుండా మరో మంత్రి జోక్యం చేసుకునే అవకాశం లేదని, అలాంటప్పుడు జిల్లా విద్యా శాఖ అధికారులు ఆమె రికమండేషన్‌ను ఇంత గుడ్డిగా ఎలా నమ్మారంటు ఉన్నతాధికారులు జిల్లా అధికారులపై మండిపడినట్లు సమాచారం.ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ పోస్టుకు అంటే పని ఒత్తిడి లేకపోవడం,అదనపు వేతనం కూడా అందుతుండటంతో కోఆర్డినేటర్ పోస్టు పట్ల చాలామంది పోటీ పడుతున్నారు.ఈ నేపథ్యంలోనే మంగళ ఆ పోస్టును వదులుకోలేక ఏకంగా మంత్రి కేటీఆర్ సంతకాన్నే ఫోర్జరీ చేసేశారని ఉపాధ్యాయ సంఘట అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు.పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో వుంటు ఇలాంటి ఘటనకు పాల్పపడడం,ఉపాధ్యాయ వృత్తికే సిగ్గు చేటు అని,ఉపాధ్యాయరాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈమె గతంలో 2017లో పరిక్షలు నిర్వహించిన సమయంలో అవకతవకలకు పాల్పపడిందని,దినిపై తాము ఫిర్యాదు చేసిన అధికారులు చర్యలు తీసుకోక పోవడంతో,అమె ఇంతటి పనికి దిగజారిందని మండిపడ్డారు.