అమరావతిః వినియోగదారులకు తాజా వస్తువులు అందచేస్తామని డప్పలు కొట్టుకునే రిలయన్స్ ఫ్రెష్ స్టోర్‌లో పురుగులతో నిండిపోయిన పప్పులు,ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన బాదంపాలు అమ్ముతున్నారని కొందరు వినియోగదారులు ఆరోగ్యశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు.దింతో వరంగల్ లోని కేయూ క్రాస్ రోడ్లో ఉన్న రిలయన్స్ ఫ్రెష్ స్టోర్స్‌కు శానిటరీ ఇనస్పెక్టర్ శ్రీనివాస్ తనిఖీలకు వెళ్లారు.అక్కడి పప్పులో పురుగులు కనిపించడం,కాలం చెల్లిన పానీయాలు ఉండటంపై తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేశారు.రూ.10 వేల జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు.ఇక ఈ విషయమై స్టోర్ మేనేజర్ వివరణ ఇస్తూ,ఈ సెక్షన్ లో పనిచేసే ఉద్యోగి గత మూడు రోజులుగా రాకపోవడంతోనే కొన్ని ఉత్పత్తులను తొలగించలేకపోయామని, భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరుగకుండా చూసుకుంటామని చెప్పారు.