రాత్రికి ప్రభుత్వం మనస్సు మార్చుకుంటుందా ?

తెలంగాణ RTCలో సమ్మె తప్పేలా లేదు..!అమరావతి: తెలంగాణ RTCలో సమ్మె తప్పేలా లేదు..! ఇవాళ IASల కమిటీతో RTC కార్మిక సంఘాల నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇప్పుడు సమ్మెపై సస్పెన్స్ నెలకొంది. కార్మిక సంఘాలతో IASల కమిటీ శుక్రవారం 3వ సారి చర్చలు విఫలమైనట్టు,చర్చల నుండి బయటకు వచ్చిన కార్మిక సంఘాల నేతలు యథాతథంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మెను కొనసాగించనున్నట్టు ప్రకటించారు.ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచిన 26 డిమాండ్లలో 25 డిమాండ్లు పక్కన పెట్టినా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండునే ప్రధానంగా వినిపిస్తున్నారు.ఈ విలీనంపై తమకు స్పష్టమైన హామీ కావాలని కోరుతున్నారు.కమిటీ ఏర్పాటు చేసి మూడు రోజులే అయ్యింది కాబట్టి మరికొంత సమయం కావాలని,ఆర్టీసీ స్థితిగతులు,కార్మికులపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని,కార్మికుల డిమాండ్స్ పై పూర్తిగా చర్చించాల్సిన అవసరం ఉందని IASల కమిటీ సభ్యులు సోమేష్‌కుమార్, సునీల్ శర్మ, రామకృష్ణారావులు ఆర్టీసీ కార్మికులను కోరారు.ఇందుకు కార్మిక సంఘాలు మాత్రం వెనక్కి ససేమిరా అంటున్నాయి.సమ్మెకు వెళ్తామని,శుక్రవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమవుతోందని స్పష్టం చేశారు.మూడు రోజుల నుంచి చర్చలు జరిగినప్పటికి డిమాండ్ లపై ఎలాంటి పురొగతి కన్పించడం లేదని, IASల కమిటీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదని కార్మిక సంఘాల నేతలు చెప్పారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఆర్టీసీ అధికారులు మునిగిపోయారు. గడువు ముగుస్తుండడంతో మరోసారి చర్చలకు ఆహ్వానిస్తారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.ఇదే సమయంలో శుక్రవారం రాత్రికి ప్రభుత్వం మనస్సు మర్చుకుని,కార్మికులు డిమాండ్ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తుందన్న ధీమాతో కార్మిక సంఘ నాయకులు ఉన్నట్లు సమాచారం,,మరి ఏం జరుగుతోందో అనేది రాత్రి 12 గంటల వరకు అగాల్సిందే .??