బీజెపీలో చేరానున్న నిర్మాత దిల్ రాజు!

అమరావతి: తెలుగు ఇండస్ట్రీ అగ్రనిర్మాతల్లో ఒకరు అయిన దిల్ రాజు త్వరలో బీజెపీ తీర్దం పుచ్చుకోనున్నారా అంటే అవును అనే సమాధనం కన్పిస్తుంది.టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని దిల్ రాజు అన్ని వర్గాలతో వారితో మంచి సంబంధాలు కొనస్తాగిస్తుంటాడు.ఈ నేపథ్యంలో దిల్ రాజు క్రియాశీల రాజకీయాల వైపు వెళ్తున్నారని కొన్ని సినిమా పరిశ్రమలో ప్రచారం జరుగుతుంది.అయన  తన సొంతూ ఉరిలో పలు అభివృద్ది పనులు చేశారు.గతంలో ఒక సారి అయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం వస్తే వదులుకోనని వ్యాఖ్యనించాడు. ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన విందుకు తెలుగు ఇండస్ట్రీ వెళ్లిన దిల్ రాజు,ప్రధానితో చాలా సేపు మటామంతీ కలిపారు.ఈ ఇద్దరూ దిగిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. ఈ భేటీలో దిల్ రాజు బీజేపీలో చేరే దానిపై కూడా చర్చ జరిగిందని తెలుస్తుంది.వెంటనే కాకపోయిన మరికొద్ది రోజుల్లో దిల్ రాజు కమలం జెండా కప్పుకుంటారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యనిస్తున్నారు…మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే ??