ESI మందుల కొనుగోళ్ల స్కాంలో ESI డైరెక్టర్ దేవికారాణి ఆరెస్ట్

స్వాం విలువు దాదాపు రూ.200 కోట్లు ?అమరావతి: కార్మికులు,మధ్య,దిగువ తరగతి ఉద్యోగులకు ప్రభుతం అందించే మెడికల్ సదుపాయంను, ఆడ,మగ అన్న తేడా లేకుండా నిస్సిగ్గుగా దొచుకుంటున్న అవినితి అధికారిణి దేవికారాణిని ACB అధికారులు హైదరాబాద్ లోఆరెస్ట్ చేశారు..లక్షల జీతాలు తీసుకుంటు,ఏం పోయే కాలం దాపురించింది,, కార్మికులు నెల రోజులు పాటు చేసిన కష్టం నుండి కొంత సొమ్మును మినహాయించుకుని యాజమన్యలు ESIకి జమ చేస్తాయి…అలాంటి దగ్గర కూడా దొపిడికి పాల్పపడుతన్న అధికారులను ఏం చేయాలి.? గత రెండు నెలల నుండి మందుల స్కాంలో దర్యాప్తు చేస్తున్న ACB అధికారులు, ESI మందుల కొనుగోళ్ల స్కాంలో ESI డైరెక్టర్ దేవికారాణిని, ఆమెతోపాటూ ఆమె కొడుకును షేక్ పేటలోని ఇంట్లో అరెస్టు చేసి,బంజారాహిల్స్ లోని వారి కార్యాలయానికి తరలించారు.అలాగే ESI జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఇందిర,ఫార్మాసిస్ట్ రాధిక,ఓమ్నీ మెడి కంపెనీ ఎండీ శ్రీహరి,ఓమ్నీ మెడి కంపెనీ ఉద్యోగి నాగరాజు, IMS సీనియర్ అసిస్టెంట్ హర్షవర్ధన్‌ను కూడా ఇవాళ అరెస్టు చేశారు.గురువారం హైదరాబాద్‌లో ఒకేసారి 23 చోట్ల సోదాలు చేసిన ACB అధికారులు, రూ.10 కోట్ల భారీ స్కాం జరిగినట్లు అంచనాకి వచ్చారు.దేవికారాణి, JD పద్మ,AD వసంత, ఫార్మా కంపెనీల ప్రతినిధుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేసిన ACB,అవసరం లేకపోయినా నఖిలీ బిల్లులతో దేవికారాణి, మందులు కొన్నట్లు నిర్దారణకు వచ్చారు. రూ.10 వేల మందులకు దేవికారాణి రూ.లక్ష క్లెయిమ్‌ చేయడంతో పాటు బినామీ పేర్లతో కూడా మందులు కొన్నట్లు బయటపడింది.పైగా అర్హత లేని ఏజెన్సీల నుంచి మందుల కొన్నట్లు స్పష్టమైంది.ESI Scam లో దేవికారాణితో పాటు 17మంది ESI ఉద్యోగులు,(కాజీపేట ఓ ఛానెల్‌ రిపోర్టర్‌-నరేందర్), నలుగురు ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. 2017-18 ఏడాదిలో రూ.43 కోట్ల విలువైన అనవరమైన మందులు కొనుగోలు చేసినట్టు విచారణలో తేలింది.దేవికారాణి అండలతో గత సంవత్సర కాలంగా వీళ్లంతా కలిసి అక్రమాలకు పాల్పడ్డారు.ఇప్పటికే ఉన్న 26 కొనుగోలు ఆర్డర్లు రద్దు చేసి, బినామీ ఆర్డర్లు సృష్టించి మందులు కొన్నట్లు ACB DG తెలిపారు. వరంగల్ కేంద్రంగా స్కామ్ చోటు చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు తేల్చారు.రూ.12 కోట్ల వరకు కుంభకోణం ఉంటుందని ACB అధికారులు చెబుతున్నారు. మరోవైపు దాదాపు 100 నుంచి 200 కోట్ల వరకు అక్రమంగా మందులు కొనుగోలు చేసినట్టు అంచనా వేస్తున్నారు.దేవికా రాణిని ప్రశ్నించడం ద్వారా ఈ కేసులో మరిన్ని నిజాలు,అవినితి పెద్ద తలకాలయలు భాగోతం వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.””శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఈ కుంభకోణం బయటపెట్టారు.”” 

LEAVE A REPLY