నిత్య యవ్వనం మీ చేతుల్లోనే ఉంటుంది- బౌద్ధ మత గురువు

0
291
Tibetan spiritual leader the Dalai Lama greets his followers at the Buddhist cultural school in Salugara on the outskirts of Siliguri on March 28, 2013. The Dalai Lama expressed his sorrow for the self immolation protests going on in Tibet while speaking to journalists on his second day of a three day visit in Salugara, in the eastern Indian state of West Bengal after an inauguration ceremony of a 130 foot Lord Buddha statue at Buddha Park. AFP PHOTO/Diptendu DUTTA (Photo credit should read DIPTENDU DUTTA/AFP/Getty Images)

తెలంగాణః రోజుకు 9 గంటలు నిద్రపోతే నిత్య యవ్వనం మీ చేతుల్లోనే ఉంటుందని, బౌద్ధ మత గురువు దలైలామా అన్నారు.దలైలామా సౌత్ ఏషియా సెంటర్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న, తెలంగాణ‌ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్,, దలైలామాను ఒక ప్రశ్న వేశారు.మేము కూడా మీలాగా తేజోవంతంగా, హుషారుగా, తెలివిగా ఉండాలంటే ఏం చేయాలి. మీరు పాటిస్తున్న రహస్యాన్ని తెలపండని కోరారు. ఈ ప్రశ్నకు దలైలామా నవ్వుతూ,,, ప్రశాంతంగా నిద్రపోవడమే,,,అనే స‌మాధ‌నం ఇచ్చారు. తాను ప్రతి రోజు 9 గంటలు నిద్రపోతానని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు నిద్రపోయి, తెల్లవారుజామున 3గంటలకు లేస్తానని, ఆ తర్వాత నాలుగైదు గంటలు ధ్యానం చేస్తానని తెలిపారు. ప్రస్తుతం తన వయసు 82 సంవత్సరాలని, కానీ అందరూ 60-65 సంవత్సరాలని అనుకుంటారన్నారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, బౌద్ధ గురువు దలైలామాతో గడిపిన ఈ క్షణాల్లో తాను ఎంతో విలువైన అంశాలు నేర్చుకున్నానని తెలిపారు. దలైలామా సౌత్ ఏషియా సెంటర్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ సెంటర్‌ కార్యాకలాపాలకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయం చేస్తామని తెలిపారు. ఇప్పటికే స్థలం, రూ. 5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు..

LEAVE A REPLY