బిజెపితో చంద్ర‌బాబు,జ‌గ‌న్‌లు లాలుచీ-మ‌ధు,రామ‌కృష్ణ‌

0
106

అమ‌రావ‌తిః ప్రత్యేక హోదా విషయంలో 4 సంవ‌త్స‌రాల పాటు బీజేపీతో లాలూచీ పడి, ఇప్పుడు తానే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న‌ట్లు చంద్ర‌బాబు నాటకాలు ఆడుతున్నారని సీపీఎం నేత‌ మధు విమ‌ర్శించారు.సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అనంతరం అయ‌న మీడియాతో మాట్లాడారు.ఏపీకి రాజధాని లేదని,విద్యాసంస్థలు,నిధులు, రైల్వే జోన్,ప్యాకేజీ లేదని,జాతీయ విద్యా సంస్థలు ఇస్తామని చెప్పినప్పటికీ నత్తనడకన సాగుతోందని అన్నారు.విభజన చట్టంలో చెప్పినవి ఏవీ జరగడం లేదని,ఏపీకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని బీజేపీ,హామీలు నెరవేర్చేలా ఒత్తిడి తేలేని టీడీపీ,దీనిపై తీవ్ర పోరాటం చేయాల్సిన వైసీపీ,కాంగ్రెస్‌లు విఫలమయ్యాయని ఆరోపించారు.బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు.చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో పెద్ద డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.మోడీ,అమిత్ షాలు ఢిల్లీలో ఉండి ఏపీకి అన్యాయం చేస్తే,టీడీపీ, వైసీపీలు మోడీకి వత్తాసు పలికి,అన్ని ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలిచి ఏపీకి అన్యాయం చేశారన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మోడీతో చంద్రబాబు,జగన్‌లు లాలూచీ పడ్డారని మండిపడ్డారు.
చంద్రబాబు ఈ మధ్య కొత్త డ్రామాకు తెరలేపారని,తనను ఎవరైనా విమర్శిస్తే ఏపీ కోసం పాటుపడుతున్న తనను బలహీనపరుస్తున్నారని కొత్త డ్రామాకి తెర తీసే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఇన్నాళ్లు లాలూచీ పడి,ఇప్పుడు కేంద్రంపై పోరాడినట్లు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు.28న విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా కచ్చితంగా సాధిస్తామని చెప్పారు. ఏప్రిల్ నెలలో మరోసారి సమావేశం అవుతామని చెప్పారు. తమకు అండగా ఉండే రాజకీయాలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

LEAVE A REPLY