మాజీ ముఖ్య‌మంత్రి తిరిగి కాంగ్రెస్‌లోకి

0
86

అమ‌రావ‌తిః ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైందని,త్వరలోనే అధిష్టానాన్ని కలుస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి.సుబ్బిరామిరెడ్డి చెప్పారు.బుధవారం ఇరువురు నేతలు దాదాపు అరగంటకు పైగా చర్చించారు.భేటీ అనంతరం సుబ్బిరామిరెడ్డి మీడియాతో మాట్లాడ‌తూ మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు జాతీయస్థాయిలో సముచితస్థానం పార్టీలో ఉంటుందని చెప్పారు.కిరణ్ కుమార్ రెడ్డి వేరే రాష్ట్రాల్లో జనరల్ సెక్రటరీ స్థాయి పదవులకు అర్హులని,అధిష్టానం నుంచి వచ్చిన సందేశాన్నితాను కిరణ్ రెడ్డికి తెలిపానన్నారు.త్వరలోనే ఆయన పార్టీలో చేరుతారని చెప్పారు.కాంగ్రెస్ పార్టీకి దూరమైన నేతలను తిరిగి ఆహ్వానించాలని పార్టీ ఇటీవల నిర్ణయించింది.ఇందులో భాగంగా ఇప్పుడు కిరణ్ రెడ్డిని క‌ల‌వగా,తొంద‌ర‌లో హర్ష కుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్‌లను కూడా కలిసిపార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సందేశాన్ని తెలియ‌చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.మరోవైపు,ఊమెన్ చాందీతో కిరణ్ రెడ్డి ఇప్పటికే ఫోన్లో మాట్లాడారని తెలుస్తోంది.కిరణ్ రెడ్డి వస్తే పార్టీకి మంచిదనే అభిప్రాయం పలువురు నేతల్లో వ్యక్తమవుతుంది.

LEAVE A REPLY