తెలంగాణ‌లో మహాకూటమిలో సీట్ల సర్దుబాటు-కుంతియా

0
103

అమ‌రావ‌తిః ఎట్ట‌కేల‌కు మహాకూటమిలో సీట్ల సర్దుబాటుతో పాటు తమ అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో కసరత్తు ముగిసింది.గుర‌వారం సోనియాగాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో పార్టీ స్క్రీనింగ్ కమిటీ అందజేసిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పరిశీలించింది.అనంతరం పార్టీ సీనియర్ నేత కుంతియా మీడియాతో మాట్లాడుతూ, 94 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతోందని చెప్పారు. తొలి విడతలో 74 మంది అభ్యర్థులను ఖరారు చేశామని తెలిపారు. అభ్యర్థుల తొలి జాబితాను 10వ తేదీ ఉదయం విడుదల చేస్తామని చెప్పారు. భాగస్వామ్య పార్టీలకు 25 సీట్లు కేటాయించామని… వీటిలో 14 స్థానాలు టీడీపీకి, 8 టీజేఎస్ కు, 3 స్థానాలు సీపీఐకి కేటాయించామని తెలిపారు. మరో మిత్రపక్ష పార్టీ అయిన తెలంగాణ ఇంటి పార్టీకి ఒక స్థానం కేటాయించే అవకాశం ఉందని చెప్పారు.

LEAVE A REPLY