న‌మ్మిన వారికి సీట్లు ఇవ్వ‌క‌పోతే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను-రేవంత్‌

0
30

అమ‌రావ‌తిః కాంగ్రెస్ ఆధికారంలోకి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కంతో,పార్టీలో టికెట్లు ఆశించేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంటే,నాయ‌కులు తమతో పాటు అనుచరులకు సైతం పార్టీ టికెట్లు ఇవ్వాలని మొండిపట్టు పడుతున్నారు.దీనికితోడు ప్రజాకూటమిలో మిత్ర పక్షాలకు కొన్నికీలక సీట్లను కేటాయించాల్సి రావడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటి వ‌ర‌కు 74 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన ఢిల్లీ పెద్ద‌లు,పోటీ తీవ్రంగా వుండ‌డంతో మరో 19 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు.ఈ నేపథ్యంలో తన అనుచరుడు చిరమర్తి లింగయ్యకు నకిరేకర్‌ టికెట్‌ ఇవ్వకపోతే తాము పోటీ నుంచి తప్పుకుంటామని కోమటిరెడ్డి సోదరులు ప్రకటించారు.తాజాగా ఈ జాబితాలోకి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేరారు.కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా ఇచ్చిన ఏ హామీని హైకమాండ్ పట్టించుకోవడం లేదని రేవంత్ అలకబూనారు. ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్లు ఇవ్వకపోతే పోటీ నుంచి తప్పుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. రేవంత్ తన అనుచరుల కోసం*8* సీట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది. 1. వరంగల్ పశ్చిమం (నరేందర్ రెడ్డి),,2. నిజామాబాద్ గ్రామీణం (అరికెల నర్సారెడ్డి),,3. ఆర్మూరు (రాజారామ్ యాదవ్) 4. ఎల్లారెడ్డి (సుభాష్ రెడ్డి),,5. దేవరకొండ (బిల్యా నాయక్),,6. ఇల్లందు (హరిప్రియ),,7. సూర్యాపేట (పటేల్ రమేష్ రెడ్డి),, 8. చెన్నూరు (బోడ జనార్దన్).మ‌రి ప‌రిస్దితిని పార్టీ హైకంమాడ్ ఎలా ప‌రిష్క‌రిస్తుందో వేచి చూడాల్సిందే ?

LEAVE A REPLY