కాంగ్రెస్ నేత‌ల‌కు తిరిగి పార్టీలోకి ఆహ్వ‌నం-ఊమెన్ చాందీ

0
76

అమ‌రావ‌తిః రాష్ట్ర విభ‌జ‌న‌పై అన్ని పార్టీలు ఆమోదం తెలిపినంతరంమే,విభ‌జ‌న ప్ర‌క్రియ జ‌రిగింది,విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు న్యాయం చేసేలా చ‌ట్టంలో అనేక అంశాల‌ను చేర్చ‌డం జ‌రిగింద‌ని కాంగ్రెస్‌పార్టీ సినియ‌ర్ నాయ‌కుడు ప‌ల్లంరాజు తెలిపారు.ఆదివారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత హైదరాబాదులోని ఇందిరాభవన్‌కు ఊమెన్ చాందీ తొలిసారి వచ్చారు.ఈ సందర్భంగా ప‌ల్లంరాజు మాట్లాడుతూ ఏపీలో పార్టీ బలోపేతం,పార్టీకి దూరమైన నేతలను మళ్లీ ఆహ్వానించడంపై లోతుగా చర్చ జరిగిందని,ఇందులో బాగంగానే మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వ‌నిచండం జ‌రిగింద‌న్నారు.ఈస‌మావేశంలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు కేవీపీ రామచంద్రరావు,కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి,జేడీ శీలం, ఏఐసీసీ నూతన కార్యదర్శులు క్రిస్టఫర్,మరియప్పన్‌లు కూడా పాల్గొన్నారు.ఊమెన్ చాందీ ఆధ్వర్యంలో జూలై 9 నుంచి 13వ తేదీ వరకు ఏపీలో కాంగ్రెస్ నేతలు పర్యటించనున్నారు.

LEAVE A REPLY