నిలోఫర్ చిన్న పిల్లల ఆసుపత్రిలో క్లినికల్ ట్రయిల్స్!

విచారణకు అదేశించిన ప్రభుత్వం.అమరావతి: హైదరాబాద్ లోని నిలోఫర్ చిన్న పిల్లల ఆసుపత్రిలో గుట్టు చప్పుడు కాకుండా క్లినికల్ ట్రయిల్స్ నిర్వహిస్తున్నట్లు వార్తలు రావడంతో పిల్లల తల్లితండ్రులు ఆందోళనకు గురిఅవుతున్నారు.ఫార్మ కంపెనీలతో కుమ్మకైన డాక్టర్లు ఈ నితీమాలిన చర్యలు దిగినట్లు తెలియడంతో ప్రభుత్వం కఠిన చర్యలు సిద్దమైనట్లు తెలుస్తుంది.జరిగిన సంఘటనపై సూపరింటెండెంట్ పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వలని వైద్యావిధాన పరిషత్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.ప్రీడియాట్రిక్ విభాగంలోకి ఓ ప్రొఫసర్ అనుమతి లేని కొన్ని మందులను,వ్యాక్సీన్ లను పిల్లలపై ప్రయోగిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో అధికారులు అప్రమత్తమైయ్యారు.ట్రయల్స్ దశలో వున్న స్వైన్ ప్లూ,,రొటా,,హెచ్.పీ.వి,ఎం.ఆర్ వ్యాక్సీన్ లను పిల్లలకు ఇస్తు,వారి ప్రాణాలతో చెలగాటమడుతన్నారు.50 మంది పిల్లలపై ప్రయోగాలు జరిగినట్లు ప్రాధమికంగా నిర్దారణకు వచ్చిన అధికారులు.ఫార్మ్ కంపెనీ ప్రతినిధులు నేరుగా ఆసుపత్రికి రావడం,ప్రయోగాలు నిర్వహించిన పిల్లల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసుకుని వెళ్లుతున్నట్లు సమాచారం.