రైల్వేశాఖాధికారులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నగర వాసులు

అమరావతి: పండుగకు సొంత గ్రామలకు వెళ్లే ప్రయాణికుల నుండి వీలైనంత ఎక్కువ ఆదాయం సంపాదించేందుకు రైల్వేశాఖాధికారులు వేసిని ఎత్తుగడను,,ప్రయాణికులు రైల్వేఅధికారులకు దిమ్మతిరిగే రీతిలో జావాబు ఇచ్చారు.అదేంటంటే,,,, దసరా సీజన్ లో ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ల రేట్లు రూ.10 టికెట్ నుండి ఏకంగా రూ.30కి ? పెంచేశారు.అక్టోబరు 10 వరకు ఈ రేట్లు అమల్లో ఉంటాయని రైల్వే శాఖ ప్రకటించింది.స్నేహితులు,బంధువులకు సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్లితే,,, ఉత్తి పుణ్యానికి రూ.30 ? చెల్లించాల్సి రావడం ఎందుకనుకున్న ప్రజానీకం అదిరిపోయే కౌంటర్ షాక్ ఇచ్చారు… రైల్వే స్టేషన్ కు వెళ్లే క్రమంలో ప్లాట్ ఫామ్ టికెట్ బదులు పాసింజర్ ట్రైన్ టికెట్ కొనడం మొదలుపెట్టారు.పాసింజర్ ట్రైన్ మినిమమ్ చార్జి రూ.10,దింతో పది రూపాయలు పెట్టి పాసింజర్ టికెట్ కొని దర్జాగా రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై అడుగుపెడుతున్నారు.ఈ విధంగా రూ.20 ఆదా చేయడంతో పాటు స్టేషన్ నుంచి బయటికి వచ్చేటప్పుడు తమ వద్ద ఉన్న పాసింజర్ టికెట్ ను ఇతరులకు ఇచ్చేస్తున్నారు.ప్లాట్ ఫామ్ టికెట్ల కన్నా పాసింజర్ టికెట్ల అమ్మకాల్లో విపరీతమైన పెరుగుదల కనిపించడంతో అధికారులు ఆరా తీస్తే ఈ విషయం బయటపడింది.తాడి తన్నే వాడు వుంటే తల తన్నే వాడు వుంటాడని పెద్దలకు ఉరికే చెప్పలేదు మరి .???