వాట్స్‌ప్ ద్వారా వ్య‌భిచారం-జిల్లాలో ప్ర‌ముఖులు

0
295

అమ‌రావ‌తిః సోష‌ల్ మీడియా ద్వారా యువ‌తుల ఫోటోల‌ను పంపి విటుల‌ను ఆక్ష‌ర్షించడం,విటుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏకంగా వాట్స్‌ప్ గ్రూప్‌ను మొయిన్‌టెన్ చేస్తున్న దీక్షితుల దంప‌తుల‌ను కోదాడ పోలీసులు ఆరెస్ట్ చేశారు.ఘ‌ట‌న పూర్వ‌ప‌రాల్లోకి వెళ్లితే సూర్యాపేట జిల్లాలోని కోదాడలోని కట్టకొమ్మగూడెం రోడ్డులో దీక్షిత్‌,ఈశ్వరమ్మదంపతులు నివాసం ఉంటున్నారు.సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న వీరు ఏపీ,తెలంగాణకు చెందిన పలువురు యువతులతో వ్యభిచారం నిర్వహించడం మొదలుపెట్టారు.అమ్మాయిల ఫొటోలను వాట్సాప్ ద్వారా విటులకు పంపి డీల్ ఖరారు చేసేవారు.ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్నపోలీసులు దీక్షిత్ ఇంటిపై దాడులు నిర్వహించి,ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు,ఓ యువతిని రెస్కూహోమ్ కు తరలించారు.నిందితులను ఆదుపులోకి తీసుకున్న పోలీసులు,,, వారి ఫోన్లను పరిశీలించిగా,,, జిల్లాలోని చాలామంది ప్రముఖులు వీరి కస్టమర్లుగా ఉండటం చూసి విస్తుపోయారు.జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, రాజ‌కీయ‌నేతలు,ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు,ప్రైవేటు ఉద్యోగులు వీరి కస్టమర్లుగా ఉన్నట్లు గుర్తించి షాక్‌కు గురయ్యారు.స‌మాజంలోని సోకాల్డ్‌ ప్రముఖులు ఇందులో ఉండటంతో పోలీసులు వారి పేర్లను గోప్యంగా ఉంచుతున్నారు.

LEAVE A REPLY