మైనార్టీల ర‌క్ష‌ణ కోసం కాదు మెజార్టీ ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ కోసం-ప‌రిపూర్ణ‌నంద‌

0
107

అమ‌రావ‌తిః ఓటు బ్యాంకు రాజ‌కీయాల కోసం ఓ వృద్దపూజారిని చంపేశారు.మైనార్టీల ర‌క్ష‌ణ కోసం కాదు మెజార్టీ ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ కోసం ఉద్య‌మించాల్సి వస్తుంద‌ని టి.ఆర్.ఎస్ ప్ర‌భుత్వ పాల‌న‌పై శ్రీపీఠం పీఠాధిపతి,బీజేపీ నేత స్వామి పరిపూర్ణానంద స్వామి మండిప‌డ్డారు. శ‌నివారం అయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో హిందువుకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేద‌న వ్య‌క్తం చేశారు.వరంగల్‌లో సాయిబాబా మందిర పూజారిపై ఓ ముస్లిం మతోన్మాది చేసిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారని, పూజారి అంతిమయాత్రకు వెళ్తే, వందలాది మంది పోలీసులను రంగంలోకి దించారని మండిపడ్డారు. ప్రస్తుతం రజాకార్ల పాలన కొనసాగుతోందని,,,దారుస్సలాం (ఎంఐఎం) కనుసన్నల్లోనే ప్రభుత్వం నడుస్తోందని విమ‌ర్శించారు.దారుస్సలాం కనునన్నల్లో కాకుండా,లాల్ దర్వాజ కనుసన్నల్లో ప్రభుత్వం నడవాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.మైనార్టీల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తే,,బి.సి క‌డ‌పు కొట్ట‌డ‌మేన‌న్నారు.తెలంగాణ అంటే నిజాం అని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అన్నారని పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తం చేశారు.జీసన్ పాలన తీసుకొస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని విమర్శించారు.ఈ ఎన్నికల్లో ప్రతి హిందువు ఓటు వేయాలని,ఎవరు బాగా పరిపాలిస్తారో వారికే ఓటు వేయాలని,బీజేపీకి కులమతాలు ఉండవని అన్నారు.

LEAVE A REPLY