హైదరాబాద్ ESI కుంభకోణం మూలాలు ఆంధ్రలో వున్నాయా?

అమరావతి: హైదరాబాద్ ESIలో కోట్ల రూపాయల మేర కుంభకోణం జరగడం సంచలనం సృష్టించింది. ESI డైరెక్టర్ దేవికారాణి సహా అనేకమంది ఉన్నతస్థాయి వ్యక్తులు ఈ స్కామ్ లో సూత్రధారులని ACB ప్రాథమిక విచారణలోనే తేల్చింది.నకిలీ బిల్లులతో మందులు కొనుగోలు చేసి కోట్ల రూపాయలు స్వాహా చేసినట్టు తెలిసింది. అయితే ఈ కుంభకోణం మూలాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా కన్పిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ స్కామ్ కు సంబంధించి ESI విజయవాడ డైరెక్టరేట్, తిరుపతి కార్యాలయాల్లోనూ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.పలు కీలక పత్రాలు,రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.