హైద‌ర‌బాద్‌లో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో మంత్రి నారాయ‌ణ కుమారుడు నిశిత్ మృతి

0
1188

హైద‌ర‌బాద్ః బుద‌వారం వేకువ‌జామున 3 గంట‌ల స‌మ‌యంలో మెర్సిడిస్ బెంజ్‌కారులో వెళ్లుతున్న మునిసిపాల్ శాఖ మంత్రి పొంగూరు.నారాయ‌ణ కుమారుడు నిశిత్,అత‌ని స్నేహితుడు రాజార‌వివ‌ర్మ‌లు హైద‌రబాద్ జాబ్లీహిల్స్ రోడ్డు నెంబ‌ర్ 36 వ‌ద్ద ఫైఓర్ పిల్ల‌ర్‌ను వేగంగా డీ కొన‌డంతో అక్క‌డిక్క‌డే మృతి చెందారు.మంగ‌ళ‌వారం రాత్రి హైద‌ర‌బాద్‌లో వాన‌తో పాటు ఈదురు గాలులు వీయడంతో,జాబ్లీహిల్స్ ప్రాంతంలో రోడ్డుపై చెట్లు విరిగిప‌డి,వాన నీరు రోడ్డుపైకి చేరివున్న‌ట్లు తెలుస్తుంది.అదే స‌మాయ‌నికి ఆ ప్రాంతంలో చెట్లును క్లియ‌ర్ చేసేందుకు ప‌నుల‌ను ప‌రివేక్షిస్తున్న‌,జిహెచ్ఎంసి సిబ్బంది,పెద్ద శ‌బ్దం రావ‌డంతో వెంట‌నే ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతానికి చేరుకుని, క్ష‌త‌గాత్రుల‌ను జాబ్లీహిల్స్ అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ప్ప‌టికి ప్ర‌యోజనం లేక‌పొయింది.విదేశ‌ప‌ర్యాట‌న‌లో వున్న నారాయ‌ణ రేపు ఉద‌యంకు నెల్లూరుకు చేరుకుంటారని తెలుస్తుంది.అపోలో ఆసుప‌త్రి వ‌ర్గాలు,పోస్టుమార్టం నిర్వ‌హించ‌నంతరం,నారాయ‌ణ కుటుంబ స‌భ్యులు మృతు దేహ‌న్ని నెల్లూరుకు తీసుకుని రానున్నారు.

LEAVE A REPLY