రేప‌టి నుండి వేస‌వి శిక్షణా శిబిరాలు ప్రారంభం

0
144

నెల్లూరుః ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్ద ఆధ్వ‌ర్యంలో నెల్లూరు జిల్లాలో ఎంపిక చేసిన 34 గ్రామీణ ప్రాంతాల్లో 34,జిల్లాకేంద్రాల్లో 16,ఏసి స్టేడియంలో 10 తో క‌ల‌పి మొత్తం 60 కేంద్రాల్లో శిక్ష‌ణా శిబిరాలు నిర్వ‌హిస్తున‌ట్లు ఛీఫ్ కోచ్ వి.వి ర‌మ‌ణ‌య్య సోమ‌వారం తెలిపారు.శిక్ష‌ణా శిబిరాలు ఈనెల 24వ తేది నుండి మే 23వ తేది వ‌ర‌కు దాదాపు 30 రోజుల పాటు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.శిక్ష‌ణా శిబిరాలు నిర్వ‌హించినందుకు పి.ఇ.టిల‌కు,సీనియ‌ర్ క్రీడాకారుల‌కు ప్రాధికార సంస్ద 2500 రూపాయ‌లు గౌర‌వ‌వేతనం అంద‌చేస్తామ‌న్నారు.సంబంధిత క్రీడాప‌రిక‌రాలు,ప్ర‌శంశా పత్రాలు క్ర‌మం త‌ప్ప‌కుండా హాజ‌రైన విద్యార్దిని,విద్యార్దుల‌క శిక్ష‌ణాశిబిరం చివ‌రి రోజున ముఖ్య అతిధుల చేతుల‌మీదుగా అంద‌చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.
వేసవి శిక్ష‌ణా శిబిరాల్లో నిర్వ‌హించే క్రీడాంశాలుః 1.అథ్లెటిక్స్‌,బాస్కెట్‌బాల్‌,3.తైక్వొండో,4.పుట్‌బాల్‌,5.హాకీ,6.ఆర్చ‌రీ,7.ఖో-ఖో, 8.వాలీబాల్‌, 9.సాప్ట్‌బాల్‌,10.యోగా, 11.రోల‌రుస్కెటింగ్‌,12.చెస్‌,13.బాల్ాడ్మింట‌న్‌,14.టేబుల్‌టెన్నిస్‌,15.స్విమ్మింగ్‌,16.క్యార‌మ్స్‌,17.రెస్లింగ్‌,18.క‌బ‌డ్డి,19.వెయిట్‌లిప్టింగ్‌లు ఉన్నాయి.వేసవి శిక్ష‌ణా శిబిరాల అనంత‌రం ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన క్రీడాకారుల‌ను గుర్తించి భ‌విష్య‌త్ జిల్లా,రాష్ట్ర స్దాయి పోటీల్లో పాల్గొనేందుకు అవ‌కామిస్తాన్నారు.యువ‌త ఈ అవ‌కాశంను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

LEAVE A REPLY