రోజుకో మ‌లుపు తిరుగుతున్న త‌మిళ‌నాడు రాజ‌కీయం

0
310

హైకోర్టును ఆశ్ర‌యించిన దిన‌క‌ర‌న్‌..?
చెన్నైః త‌మిళ‌నాడు రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీ మీద తిరుగుబాటు చేసి అనర్హత వేటుకు గురైన 18 మంది ఎమ్మెల్యేలు మాజీలు అయ్యారని, ప్రభుత్వ వెబ్ సైట్ లో వారి పేర్లు, వివరాలు తొలగించాలని తమిళనాడు సెక్రటేరియట్ అధికారులు భారత ఎన్నికల కమిషన్ రాసిన లేఖలో వివరించారు.18 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలు క్వాట్ట‌ర్స్ ఖాళీ చేయించాలని ఇప్పటికే స్పీకర్ ధనపాల్ ఆదేశాలు జారీ చేశారని సెక్రటేరియట్ అధికారులు భారత ఎన్నికల కమిషన్ కు సమాచారం ఇచ్చారు. భారత ఎన్నికల కమిషన్ తమిళనాడులోని 18 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.భారత ఎన్నికల కమిషన్ 18 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయని అధికారికంగా ప్రకటిస్తే దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అవుతారు. గవర్నర్ విద్యాసాగర్ రావ్ చెన్నై చేరుకున్న తరువాత మాకు అన్యాయం జరిగిందని టీటీవీ దినకరన్ ఆయన్ను కలిసే అవకాశం ఉందని సమాచారం.దిన‌క‌ర‌న్ తామ‌కు ఆన్యాయం జ‌రిగిందంటు హైకోర్టును ఆశ్ర‌యించారు.

LEAVE A REPLY