పెరోల్‌పై జైలు నుండి బ‌య‌ట‌కు చిన్న‌మ్మ‌-మార‌నున్న రాజ‌కీయాలు

0
594
Chennai: AIADMK General Secretary VK Sasikala before leaving for meeting with Governor CH Vidyasagar Rao at former Chief Minister J Jayalalithaa's memorial in Chennai on Thursday. PTI Photo by R Senthil Kumar(PTI2_9_2017_000299A)

చెన్న‌ప‌ట్నంః ఎట్ట‌కేల‌కు చిన్న‌మ్మ జైలు బ‌య‌ట అడుగుపెడుతున్నారు.గ‌త కొంత కాలం నుండి విలాస‌వంత‌మైన జీవితం వ‌ద‌లి,,ప‌ర‌ప్ప‌ణ జైల్‌లో దుర్బ‌ర జీవితం అనుభ‌వించిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు స్వల్ప ఊరట లభించింది. నెల రోజుల పాటు ఆమెకు పెరోల్ మంజూరు చేసింది కోర్టు. సోమ‌వారం సాయంత్రమే జైలు నుంచి ఆమె విడుదల కానున్నారు. ఆదాయానికి మించిన కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారంలో ఆమె జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. శశికళకు పెరోల్ మంజూరైన విషయం తెలియగానే ఆమె అనుచరులు, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇది ఇలా వుండ‌గా,తాను జైలుకేళ్లిన స‌మ‌యంలో,రాజ‌కీయంగా దిన‌క‌ర‌న్‌తో ఆట‌ల‌డుకున్న ఎమ్మేల్యేల సంగ‌తి తేల్చేందుకు రంగం సిద్దంమైన‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.నెల రోజుల పాటు త‌మిళ‌నాట రాజ‌కీయాలు రోజుకు ఒక మ‌లుపు తిర‌గ‌నున్నాయి…

LEAVE A REPLY