దినకరన్ పై నుంచి ఏమైనా దిగి వచ్చాడా – దీపా

0
297

చెన్నైః మొదట ఎవరు వస్తే వారే నివాళులు అర్పించాలని,మీనాయకుడు దినకరన్ పై నుంచి ఏమైనా దిగి వచ్చాడా అంటూ దీపా అనుచరులు ప్ర‌శ్నించ‌డంతో,దింతో దీపా, దినకరన్ వర్గీయులు ముష్టియుద్దానికి దిగారు.దీపా ధైర్యంగా ముందుకు వెళ్లి అన్నాదురై విగ్రహానికి నివాళులు అర్పించారు.శుక్ర‌వారం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై 109వ పుట్టిన రోజు సందర్బంగా మౌంట్ రోడ్డులోని అన్నాదురై విగ్రహం దగ్గర నివాళులు అర్పించడానికి జయలలిత మేనకోడలు దీపా తన అనుచురులతో కలిసి వెళ్లారు. అప్పటికే అక్కడ టీటీవీ దినకరన్ వర్గీయులు వేచి ఉన్నారు.మా నాయకుడు దినకరన్ ఇక్కడికి వస్తారని, మొదట ఆయనే అన్నాదురై విగ్రహానికి నివాళులు అర్పించాలని దీపాను అడ్డుకున్నారు. ఈ సంద‌ర్బంలో గొడవ జరుగుతుండ‌గా, అన్నాదురై విగ్రహానికి నివాళులు అర్పించిన దీపా తన అనుచరులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీపా వెళ్లిన 30 నిమిషాల తరువాత దినకరన్ మౌంట్ రోడ్డులోని అన్నాదురై విగ్రహం దగ్గరకు చేరుకుని నివాళులు అర్పించారు. జయలలిత వారసులు మేమే అని చెప్పుకుంటున్న దినకరన్ చివరికి అమ్మ మేనకోడలు దీపా మీదకు తన అనుచరులను రెచ్చగొట్టడంతో అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు మన్నార్ గుడి మాఫియా మీద మండిపడుతున్నారు. ఈ విషయంపై మీడియా దినకరన్ ను ప్రశ్నిస్తే నోకామెంట్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

LEAVE A REPLY