తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామినే-ఎమ్మేల్యే ఎక‌గ్రీవ తీర్మానం

0
121

అమ‌రావ‌తిః పన్నీర్ సెల్వం అధ్యక్షతన జరిగిన సమావేశంలో పళనిస్వామినే సీఎంగా ఉండాలని 111 మంది ఎమ్మేల్యేలు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. చెన్నైలోని రాయపేట్ లోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగ‌ళ‌వారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి అవసరం అయిన ఎమ్మెల్యేల మద్దతు కోసం పళనిస్వామి, పన్నీర్ సెల్వం చేస్తున్న ప్రయత్నాలు దాదాపుగా ఫలించాయి.అన్నాడీఎంకే పార్టీకి చెందిన 135 మంది ఎమ్మెల్యేలు (ముగ్గురు మిత్రపక్ష ఎమ్మెల్యేలు) మంగళవారం సమావేశానికి హాజరుకావాలని సీఎం ఎడప్పాడి పళనిస్వామి పిలుపునిచ్చారు. పుదుచ్చేరీలోని టీటీవీ దినకరన్ వర్గానికి సైతం పళనిసామి ఆహ్వానం పంపారు.
గత సోమవారం అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించిన‌. సందర్బంలో కేవలం 75 మంది ఎమ్మెల్యేలు మాత్రం సమావేశానికి హాజరుకావడంతో పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఆందోళన చెందారు.మంత్రులతో సహ మొత్తం 111 మంది ఎమ్మెల్యేలు హాజరైనారు.దినకరన్ గ్రూప్‌లో ఉండి పుదుచ్చేరి రిసార్ట్ నుంచి జారుకున్న సిరివిల్లిపుత్తూరు ఎమ్మెల్యే ఎం.చంద్రప్రభ సైతం ఈ సమావేశానికి హాజరైనారు. పన్నీర్ సెల్వం అధ్యక్ష్తతన జరిగిన అన్నాడీఎంకే పార్టీ శాసన సభ్యుల సమావేశంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వాన్ని ఏకగ్రీవంగా తీర్మానించారు. సీఎం పళనిస్వామి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే అంటూ పన్నీర్ సెల్వం చేసిన తీర్మానాన్ని శాసన సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. తమిళనాడు ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ కావాలంటే ఇంకా ఆరు మంది శాసన సభ్యల మద్దతు అవసరం అవుతోంది

LEAVE A REPLY