జ‌య‌ల‌లితను చంపేందుకు-దీప‌క్‌,శ‌శిక‌ళ క‌ల‌సి కుట్ర ప‌న్నేరు-దీపా జ‌య‌కుమార్‌,,?

0
216

చెన్న‌ప‌ట్నంః త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో హైడ్రామాలు న‌డుస్తునే వున్న‌యి.,నిప్పు లేనిదే పొగ‌రాదు అన్న సామోత ఎప్పుడు నిజ‌మే చెబుతుంది.అయితే కొన్ని విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయి,మ‌రి కొన్ని వెలుగులోకి రానివ్వ‌కుండా ఆర్పివేస్తారు.ఈ నేప‌థ్యంలో స్వ‌ర్గీయ జ‌య‌లలిత మేనకోడలు దీపా జయకుమార్ తన సోదరుడు దీపక్ పైన ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలితను చంపేందుకు తన సోదరుడు దీపక్.. శశికళతో కలిసి కుట్ర పన్నేరంటు ఆరోఫ‌ణ‌లు చేయ‌డం ద్వారా,, దీపక్‌తో పాటు శశికళను టార్గెట్ చేశారు. దీపక్‌ను వెంటనే అరెస్ట్ చేసి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పోయెస్ గార్డెన్‌లోకి వెళ్లేందుకు దీప, ఆమె మద్దతుదారులు ప్రయత్నించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులకు, దీపా మద్దతుదారుల మధ్య తోపులాట జరిగింది.ఈ సందర్భంగా దీపా మాట్లాడుతూ,. పోయెస్ గార్డెన్‌లోకి వెళ్లకుండా అడ్డుకుని తమను అవమానించారని మండిపడ్డారు. పోయెస్‌ గార్డెన్‌లో జయలలిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించేందుకు వెళ్తే శశికళ కుటుంబసభ్యులతో కలిసి దీపక్‌ తనపై దాడి చేశాడని,తనపై హత్యాయత్నం జరిగినట్లు ఆరోపించారు.జయలలిత నివాసం స్వాధీనానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు.శశికళ కుటుంబం చేతుల్లో నుంచి అన్నాడీఎంకే పార్టీని కాపాడాలని పిలుపునిచ్చారు. తనపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దీప డిమాండ్ చేశారు. జయలలిత నివాసం స్వాధీనానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. జయలలిత ఆస్తికి తానే వారసురాలినని, పోయెస్ గార్డెన్స్ తనకే దక్కుతుందన్నారు.

LEAVE A REPLY