అన్నంత పనిచేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
అమరావతి: ఎన్నికల సమయంలో వాగ్దనాలు చేయడమే కాదు అధికారం చేపట్టిన తరువాత నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీలను అమలు చేయడం మొదలు పెట్టాశాడు..అమెరికాలోకి దిగుమతి అవుతున్న వస్తువులపై టారిఫ్ యుద్దం ప్రారంభించాడు..ఇందులో బాగంగా కెనడా,,మెక్సికో,, చైనా దేశాలపై టారిఫ్‌లు విధించారు.. కెనడా,, మెక్సికో నుంచి దిగుమతులపై 25 శాతం,,చైనా నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం పన్నులు విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.. అమెరికాలో తయారీ రంగంను ప్రొత్సహించడానికి,, ఫెడరల్ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకుర్చుంచేందుకు ఈ సుంకాలను ఉపయోగిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు..ఫెంటానిల్ డ్రగ్స్ తో సహా అమెరికాలోకి వస్తున్న అక్రమ విదేశీయులు,, ప్రాణాంతక మాదకద్రవ్యాలను అరికట్టేందుకు అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ద్వారా ఈ సుంకాలు విధించానని తెలిపారు.. అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉన్నదని,,పౌరుల భద్రతను కాపాడడం అధ్యక్షుడిగా తన కర్తవ్యమని పేర్కొన్నారు..సరిహద్దు వెంట సంక్షోభం తగ్గే వరకు సుంకాలు అమలు చేస్తామని తెలిపారు.
https://x.com/WhiteHouse/status/1885833185012896054