అమెరికా హుంకరింపులు-అనవసర జోక్యం వద్దు-చైనా

అమరావతి: అగ్రరాజ్యం అమెరికాకు అన్ని విధాలుగా కంట్లో నలుసుగా మారిన చైనాను నిలువరించేదందుకు,అమెరికా కొత్త రాగం అందుకుంది… చైనాలోని జిన్ జియాంగ్ ప్రాంతంలోని ఉయిఘర్లు,కజక్,తదితర తెగలకు చెందిన ముస్లింలపై జరుగుతున్నఅణచివేత చర్యలను వెంటనే ఆపివేయాలని,లేకపోతే అణిచివేత కార్యకలాపాల్లో పాలుపంచుకున్న చైనా అధికారులకు వీసాలను రద్దు చేస్తామని అమెరికా హెచ్చరించింది.వీసాల రద్దు అధికారులతో పాటు వారి కుటుంబసభ్యులకు కూడా వర్తిస్తుందని,వారి పిల్లలు అమెరికాకు వచ్చి చదువుకోలేరని తెలిపింది.ముస్లింలపై చైనా అణచివేత అత్యంత క్రూరమైన చర్య అని అమెరికా విదేశాంగ మంత్రి మండిపడ్డారు.నిర్బంధంలో మగ్గుతున్న లక్షలాది ముస్లింలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.అమెరికా హెచ్చరికలపై చైనా మండిపడింది.అమెరికా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది.మతం పేరుతో తమ గడ్డపై తీవ్రవాదం,ఉగ్రవాదాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్న వారిని క్షమించలేమని,ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయడానికే తాము కౌంటర్ టెర్రరిజం కార్యకలాపాలను చేపట్టామని వెల్లడించింది.తాము చేపట్టిన చర్యలను జిన్ జియాంగ్ లో ఉన్న రెండున్నర కోట్ల మంది ప్రజలు కొనియాడుతున్నారని తెలిపింది.తమ అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చడానికే తమపై అమెరికా అసత్య ఆరోపణలు చేస్తోందని ఎదురుదాడికి దిగింది….

LEAVE A REPLY