ఏపి ఎక్స్‌ప్రెస్ (22416) ఏసి బోగీలో మంట‌లు

0
84

అమ‌రావ‌తిః ఏపీ ఎక్స్ ప్రెస్ (22416) ఢిల్లీ నుంచి విశాఖపట్టణం రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఏసీ బోగీ పూర్తిగా దగ్ధం కాగా మ‌రో రెండు బోగీల‌కు మంట‌లు వ్యాపించాయి.సోమ‌వారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలో ఏపీ ఎక్స్ ప్రెస్ బయలుదేరింది.గ్వాలియర్ ప్రాంతంలోని బిర్లాన‌గ‌ర్ స్టేష‌న్ సమీపిస్తున్న సయమంలో ఒక్కసారిగా ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి.మొద‌టి B7 ఏసీ బోగీల్లోమంటలు ప్రారంభంమై B6,B5 బోగీల‌కు వ్యాపించాయి,సమాచారం తెలుసుకున్న సంబంధిత అధికారులు రైలును వెంటనే నిలిపివేసి,తక్షణ చర్యలను అధికారులు ప్రారంభించారు. ఈ సంఘటనతో భయపడిపోయిన ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ రెండు బోగీల్లో మంటలు వ్యాపించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.ఏసీ బోగీలు రెండూ పూర్తిగా దగ్ధమయ్యాయి.ఈ సంఘటనలో ప్రయాణికులెవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నట్టు సమాచారం.

LEAVE A REPLY