జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు వీడ్కోలు పలికిన సుప్రీంకోర్టు ధర్మాసనం
అమరావతి: వృత్తి పరంగా తాను పూర్తి సంతృప్తిగా ఉన్నాను అని, సర్వోన్నత న్యాయస్థానం నుంచి తీర్పులు ఇవ్వలేనన్న మాట వాస్తవం అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు..శుక్రవారం లాస్ట్ వర్కింగ్ డే కావడంతో సుప్రీం ధర్మాసనం వీడ్కోలు పలికింది..ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తిగా చివరి సందేశం ఇచ్చారు..ఇప్పటికీ వరకు నేను వృత్తిపరంగా పూర్తి సంతృప్తిగా ఉన్నాను అని తెలిపారు..సీజేఐ చంద్రచూడ్ 2022 నవంబర్ 8 నుంచి ఈ పదవిలో ఉన్నారు..ఈనెల 10న పదవీ విరమణ చేయనున్నారు.
భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నానియమితులైనారు..సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు.. సంజీవ్ ఖన్నా ఈ పదవిలో ఆరు నెలలు మాత్రమే ఉంటారు..ఆయన 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు.