క‌రుణ‌నిధిని ప‌ర‌మ‌ర్శించిన ప్ర‌ధాని

0
178

చెన్న‌పట్నంః త‌మ‌ళనాడు రాజ‌కీయలు,విశ్లేష‌కుల అంచ‌నాలకు అంద‌కుండ సాగుతున్నాయి.ఈనేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సోమవారం మ‌ద్రాసు గోపాలపురంలోని కురుణానిధి ఇంటికి వెళ్లారు.డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె. స్టాలిన్‌తో పాటు కురుణానిధి కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోడీ శాలువతో సత్కరించి ఇంటిలోకి ఆహ్వానించారు.అనంతరం ప్ర‌ధాని కరుణానిధితో భేటీ అయ్యి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇదే స‌మ‌యంలో ప్రధాని నరేంద్ర మోడీతో డీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మంతనాలు జరిపారు. అనంతరం డీఎంకే పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రధానితో ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని స్పష్టం చేశారు.మర్యాదపూర్వకంగా ప్రధాని నరేంద్ర మోడీ మా నాయకుడు,కరుణానిధిని కలిశారని, ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీయ్యడానికే వచ్చారని, ఏలాంటి రాజకీయాలు చర్చకు రాలేదని డీఎంకే పార్టీ నాయకులు చెప్పారు. ప్రధాని పర్యటన సందర్బంగా గోపాలపురంలోని కరుణానిధి ఇంటి ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీసు భ‌ద్ర‌త చ‌ర్య‌లు చేప‌ట్టారు.

LEAVE A REPLY