కిమ్‌తో జరిగిన స‌మావేశం వెరీ వెరీ గుడ్‌ ట్రంప్‌

0
96

అమ‌రావతిః ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా, ఉత్తరకొరియా దేశాధినేతల మధ్య చారిత్రక సమావేశం మంగళవారం సింగపూర్‌లోని కేపెల్లా హోటల్‌ వేదికగా జ‌రిగింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌,ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌లు దాదాపు 45 నిమిషాల పాటు ముఖాముఖి సమావేశమయ్యారు.అనంతరం తమ దౌత్యాధికారులతో కలిసి ద్వైపాక్షిక చర్యలు జరిపారు.కొరియా ద్వీపకల్పంలో అణునిరాయుధీకరణ,శాంతి స్థాపనే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో చాలా కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణకు అంగీకరిస్తే ఉత్తరకొరియా భద్రతకు హామీ ఇస్తామని అమెరికా తెలిపింది. ఈ భేటీ సానుకూల ఫలితాలు ఇస్తుందని ఇరు దేశాధినేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.కిమ్‌తో జరిగిన ఈ భేటీ ‘వెరీ వెరీ గుడ్‌’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ సమావేశం పూర్తిస్థాయిలో విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అందరూ ఊహించిన దానికంటే అద్భుతంగా ఈ సమావేశం జరిగిందని నేను అనుకుంటున్నా.ఈ సమావేశం ద్వారా చాలా పురోగతి చోటుచేసుకుందని ట్రంప్‌ అన్నారు.శాంతి స్థాపనకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నట్లు కిమ్‌ పేర్కొన్నారు.ఎన్నో అడ్డంకుల తర్వాత ఈ సింగపూర్‌ భేటీ సాకారమైందని.. ఎన్నో సంశయాలు, ఊహాజనితాలను ఈ భేటీతో అధిగమించామని పేర్కొన్నారు. ట్రంప్, కిమ్‌లు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.ఈ ఒప్పందాలపై త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని ట్రంప్ చెప్పారు. అయితే, వాటి గురించిన సమాచారం ఇంకా బయటికి రాలేదు. ఇరు దేశాల మధ్య అవరోధాలను అధిగమించామని ట్రంప్ తెలిపారు.కిమ్‌ను వైట్‌హౌస్‌కి ఆహ్వానించినట్లు ట్రంప్ తెలిపారు. ఇక ఉత్తరకొరియాతో సత్ససంబంధాలు కొనసాగుతాయని అన్నారు. ట్రంప్ ఆహ్వానం నేపథ్యంలో కిమ్ త్వరలోనే అమెరికాలో కూడా పర్యటించే అవకాశం లేకపోలేదు.

LEAVE A REPLY