ఈనెల 18 నుండి లారీల స‌మ్మె-అగిపోనున్న 75 ల‌క్ష‌ల లారీలు ?

0
188

అమ‌రావ‌తిః ప్ర‌తి రోజు పెట్రోల్,డీజిల్ ధ‌ర‌ల మార్పు,ఇన్సురెన్స్ ప్రీమియం,టోల్‌ఛార్జీల అధిక ధ‌ర‌ల వ‌ల్ల లారీల స‌రుకు ర‌వాణా రంగం తీవ్రంగా న‌ష్ట‌పోతుంద‌ని,కేంద్ర ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించి,ఇంధ‌న ధ‌ర‌ల స‌మీక్ష విధానాన్ని3 నెల‌ల‌కు ఒక సారిగా మార్చాల‌ని,అలాగే ఇత‌ర స‌మ్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్కారించాల‌ని కోరుతూ ఈనెల 18వ తేది నుండి దేశ‌వ్యాప్తంగా (ACOGA) యూనియ‌న్ పూర్తి స్దాయిలో స‌మ్మెలో పాల్గొంటుంద‌ని అల్ ఇండియా ట్రాక్స్‌,లారీల ఓన‌ర్స్ అసోసియ‌ష‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజేంద్ర‌సింగ్ తెలిపారు.గ‌డ‌చిన 5 నెల‌ల్లో డీజ‌ల్ 17 శాతం పెరిగింద‌ని,దిని వ‌ల్ల లారీ ఓన‌ర్స్‌పై రూ.100 కోట్ల భారం ప‌డింద‌న్నారు.2002 నుండి హెవీ మోట‌ర్ వెహిక‌ల్ 3 పార్టీ ఇన్సురెన్స్ ప్రీమియం 910 % నుండి 1,117.2 % పెరిగింద‌న్నారు.ఈ ధ‌ర‌ల భారంతో న‌ష్ట‌లు వస్తున్నప్ప‌టికి వాహనాలు నడుపుతున్న‌మ‌ని,ఇంకా న‌ష్టాల‌ను ట్రాక్స్‌,లారీ ఓన‌ర్లు భ‌రించే స్దితిలో లేర‌న్నారు.స‌మ్మె కాలంలో నిత్యావ‌స‌ర స‌రుకుల అయిన పాలు,కూరగాయాలు,పండ్లు,ఇంధ‌నం వంటి వాటిని మిన‌హఇంపు వుంటుంద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించి,త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారించాల‌ని డిమాండ్ చేశారు

LEAVE A REPLY