షాంఘైలోని ప్రధాన కార్యాలయంలో యూనిట్ 61398

0
17

అమ‌రావ‌తిః భారత రక్షణ వ్యవస్థపై ఇప్ప‌టి వ‌ర‌కు పాకిస్తాన్ చౌర్యంకు పాల్ప‌ప‌డుతుండగా,ఇందుకు ప్ర‌స్తుతం చైనా మిలిటరీ గురి పెట్టిందంటూ భార‌తీయ‌ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని చైనా సైబర్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని,దీని కోసం చైనా ఆర్మీ ఇప్పటికే ఓ ప్రత్యేక విభాగాన్ని సిద్ధం చేసుకుందని తెలిపాయి.ఇంటెలిజెన్స్ కు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ, సైబర్ స్పేస్ లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించడం,అంతర్జాతీయంగా డిజిటల్ కమ్యూనికేషన్‌ను ఆర్దం చేసుకోవడంపై ఈ విభాగం దృష్టి సారించిందని తెలిపారు.యూనిట్ 61398 పేరుతో ఇప్పటికే రహస్యంగా భౌగోళిక సమాచారాన్ని సేకరిస్తోందని చెప్పారు. షాంఘైలోని ప్రధాన కార్యాలయంలో యూనిట్ 61398 కార్యకలాపాలను సాగిస్తోందని,ఇది భార‌త‌దేశంకు ఆందోళన కలిగించే అంశమని అన్నారు.

LEAVE A REPLY