ఉద్రిక్తతంగా శ‌బ‌రిమ‌ల అల‌య ప‌రిస‌రాలు

0
191

అమ‌రావ‌తిః అనాధిగ వ‌స్తున్న సంప్రాదాయాల‌ను మార్చేందుకు వీలు లేదంటు భ‌క్తులు ఒక వైపు,భ‌గవంతుని దృష్టిలో అంద‌రు స‌మానులేన‌ని మ‌హిళ‌ల ప‌ట్ల వివ‌క్ష‌తకు వీలు లేదని సుప్రీమ్‌కోర్టు తీర్పును ఆమ‌లు చేయాల్సిందేనంటు మ‌రో వ‌ర్గం మ‌హిళ‌లు మ‌రో వైపు నిల‌బ‌డ‌డంతో శ‌బ‌రిమ‌ల అల‌యం ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉద్రిక‌త్త ప‌రిస్దితులు చోటు చేసుకున్నాయి.శబరిమల ఆలయంలోకి మహిళలు వెళ్లవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కేరళ అట్టుడుకుతోంది. రేపు శబరిమల ఆలయం తలుపులు తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయంలోకి ప్రవేశించేందుకు బేస్ క్యాంప్ వద్దకు మహిళలు చేరుకున్నారు. మహిళల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో మహిళా నిరసనకారులు అక్కడకు చేరుకున్నారు. మహిళలను ఆలయంలోకి అనుమతిస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.తాజా పరిస్థితులపై చర్చించడానికి ట్రావెన్ కోర్ దేవాలయం సమావేశమయింది.మరోవైపు, సుప్రీం తీర్పుపై రివిజన్ పిటిషన్ వేయబోమని కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు.

LEAVE A REPLY