జాతి ప్ర‌యోజ‌న‌ల కోసం ప్రాంతీయ‌పార్టీలు ఏకం కావాలి-చంద్ర‌బాబు

0
92

అమ‌రావ‌తిః క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ కుమారస్వామి కోసం బుధ‌వారం బెంగుళూరుకు చేరుకున్న‌ ముఖ్యమంత్రి చంద్రబాబు,పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్ర మమతాబెనర్జీతో కలసి మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.జాతి ప్రయోజనాల కోసం అన్ని ప్రాంతీయ పార్టీలు కలసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని,అన్ని ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసేందుకే అందరం ఇక్క‌డికి వచ్చామన్నారు.ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలను చేపట్టబోతున్న కుమారస్వామిని కలిసి శుభాకాంక్షలు తెలియ‌చేశామ‌న్నారు. అంతకు ముందు ఆయన మమతా బెనర్జీతో మాట్లాడిన చంద్ర‌బాబు ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఈ సందర్భంగా ఆమెకు వివరించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా ఆయన భేటీ అయి, చర్చలు జరిపారు.మరోవైపు, కుమారస్వామి ప్రమాణస్వీకారానికి శరద్ పవార్, సీతారాం ఏచూరి, అఖిలేష్ యాదవ్ తదితర నేతలంతా వచ్చారు.

LEAVE A REPLY