క‌డ‌ప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర సానుకూలం-సోమిరెడ్డి

0
146

అమ‌రావతిః కడప జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్, ఆ శాఖ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి కేంద్ర సహాయ మంత్రి సుజ‌నా చౌదరితో పాటు,మంత్రి ఆదినారాయణ రెడ్డితో క‌ల‌సి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఈ విష‌య‌మై వివ‌రించిన‌ట్లు తెలిపారు.గురువారం ఢిల్లీలో ఎంపీ సీఎం రమేష్ అధికార నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 13వ షెడ్యూల్‌ను ప్ర‌కారం కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కోరినట్లు చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై మికాన్ సంస్థ ఇచ్చిన నివేదికను పరిశీలించి కేంద్ర ఉక్కు శాఖ మంత్రితో సంబంధిత రాష్ట్ర శాఖ మంత్రి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఈనెల 27వ తేదీన మరొక సారి సమావేశమై సమగ్రంగా చర్చించనున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY