లెఫ్ట్‌నెంట్ గవర్నర్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకూడ‌దు-సుప్రీం

0
87

అమ‌రావ‌తిః ఢిల్లీ పరిపాలన అధికారాలపై బుధవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.లెఫ్ట్‌నెంట్ గవర్నర్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకూడదని,గవర్నర్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం సలహా మేరకే గవర్నర్ నిర్ణయాలుండాలని,నిర్ణయాలపై ప్రభుత్వం గవర్నర్‌కు సమాచారం ఇస్తే చాలని,ఆయన ఆమోదం అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.మంత్రివర్గ నిర్ణయాలకు గవర్నర్ విలువ ఇవ్వాలని,వాస్తవ అధికారంతోపాటు జవాబుదారీతనం కూడా ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.ప్రభుత్వ వ్యవహారాల్లో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ జోక్యం బాగా పెరిగిపోయిందని,దీంతో ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోందని ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ పరిపాలనపై ఎవరికి అధికారం ఉంటుందో తెలపాలని కోరింది.అంతేగాక,ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలని కూడా కోరింది.ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వడం కుదరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.శాంతిభద్రతలు,భూ వ్యవహరాలు రాష్ట్ర పరిధిలోకి రావని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తేల్చి చెప్పింది.రాజ్యాంగం ప్రకారం ప్రతీ ఒక్కరూ నడుచుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని,ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమని,గవర్నరే ఇక్కడ సుప్రీం అని గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఢిల్లీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.గవర్నర్ సాయంతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధిస్తుందోని ఆరోపించింది.

LEAVE A REPLY